పుష్ప 2: ఫైర్ కాదు.. వైల్డ్ ఫైర్! పాట్నాలో గ్రాండ్ ఈవెంట్‌తో హైప్‌కి హైఓల్ట్

“పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా?” అంటూ మొదలైన పుష్ప కథ ఇప్పుడు ఫైర్ దాటి వైల్డ్ ఫైర్‌గా మారింది. పుష్ప 2: ది రూల్ ట్రైలర్ లాంచ్ తో ప్రేక్షకులను ఊపేసింది. పాట్నాలోని గాంధీ మైదానంలో దాదాపు రెండు లక్షల మంది అభిమానుల మధ్య నిర్వహించిన ఈ ఈవెంట్ ఏకంగా ప్యాన్-ఇండియా రేంజ్‌నే కాదు, అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్‌గా నిలిచింది.

గ్రాండ్ ఈవెంట్ – సెక్యూరిటీ హైట్స్

ఈ లాంచ్‌కి దాదాపు 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం ఇప్పటివరకు జరిగిన ఏ ఈవెంట్‌కి సాధారణ విషయం కాదు. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్‌కి తగినట్టుగా బిగ్గెస్ట్ ఈవెంట్ అంటూ మేకర్స్ సగర్వంగా చెప్పుకున్నారు.

ట్రైలర్ అంటే గూస్‌బంప్స్ ఫెస్టివల్

ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచింది. “పుష్ప అంటే నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్” అన్నట్టుగా విజువల్స్ అద్భుతంగా అలరించాయి. అల్లు ఆర్మీ ట్రైలర్‌ చూసిన వెంటనే గూస్‌బంప్స్ వచ్చేశాయని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తోంది.

సౌత్‌ హీరోకి నార్త్‌లో విపరీతమైన క్రేజ్

పాట్నాలో ఫ్యాన్స్ రెసెప్షన్ చూసిన వారంతా ఒకటే అనుకుంటున్నారు – సౌత్ హీరోకి నార్త్‌లో ఇంతమంది అభిమానులా? నార్త్‌ ఇండియాలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సృష్టించిన మ్యాజిక్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ట్రైలర్ హైలైట్ – స్టార్ కాస్ట్

2 నిమిషాల 44 సెకన్ల ట్రైలర్ విడుదలైనప్పట్నుంచీ వ్యూస్ అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్, జగపతిబాబు తదితరుల పాత్రలు ట్రైలర్‌లో హైలైట్ అయ్యాయి. ప్రతి పాత్ర గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు.

వెయ్యి కోట్ల మార్క్ సాధనకు రేసులో పుష్ప 2

ఇప్పటికే పుష్ప 2 ప్యాన్-ఇండియా రేంజ్‌లో వందల కోట్లు రాబడుతుందని టాక్‌ స్ప్రెడ్ అయింది. డిసెంబర్ 5న విడుదలకానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తుందని అందరూ నమ్ముతున్నారు.

ఐకాన్ స్టార్ బన్నీ ఇచ్చిన పిలుపు స్పష్టం – “సిల్వర్ స్క్రీన్ మీద వైల్డ్ ఫైర్ ఎలా ఉంటుందో చూడటానికి రెడీగా ఉండండి!”

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *